Jan 08,2023 13:21

ప్రజాశక్తి-వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, పాతగుంట ఉన్నత పాఠశాలలో ఆర్‌విఎస్‌ హాస్పిటల్‌ చిత్తూరువారి సహాయంతో ధన్వంతరి హెల్త్‌ అండ్‌ కేర్‌ సొసైటీవారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 130 మంది రోగులకు వైద్యం అందించి 12 మందిని రోగులకు వివిధ రకాల శస్త్ర చికిత్సకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కిషోర్‌, డాక్టర్‌.గోవర్ధన్‌ హాస్పిటల్‌ సిబ్బంది ధన్వంతరి అధ్యక్షులు రామచంద్ర భూపతి సంస్థ సభ్యులు మోహన్‌, బాబు, జ్యోతిష్‌ కుమార్‌, చందు, జ్యోతిశ్వర్‌, లత, ఉష పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ ... ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రతినెలా ఏదో ఒక మారుమూల గ్రామ ప్రాంతాలలో నిర్వహించి గ్రామీణ ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందిచడం మా సొసైటీ సంకల్పం అని చెప్పారు.