ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా ) : వెదురుకుప్పం మండలంలోని, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పేట ధనుంజరు రెడ్డి ఆధ్వర్యంలో, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పేట ధనుంజయ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెదురుకుప్పం వైస్ ఎంపీపీ బర్త్డే సుబ్రహ్మణ్యం నల్ల వెంగాన్నపల్లి ఎంపిటిసి సభ్యులు పేట సుజాత లయన్స్ క్లబ్ వెదురుకుప్పం ప్రెసిడెంట్ పేట హరికృష్ణ రెడ్డి, రామయ్య, వేద ప్రకాష్, భాస్కర్ రెడ్డి, నరసింహా రెడ్డి మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు.










