May 11,2023 15:36

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగును స్థానికులు ఉపయేగించుకోవాలని డి.కోండేపాడు గ్రామ సర్పంచి తూము వీరవెంకటనాగవేణి పిలుపునిచారు. గురువారం పిప్పర ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రామాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 60 మంది వృద్ధులకు కంటి పరిక్షలు నిర్వహించారు. వారందరికి ప్రభుత్వం ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తుందని వైద్యులు శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమలో వైద్య సిబ్బంది కె.వేణు, ఆశాలు వి.లలితకుమారి పాల్గొన్నారు.