May 19,2023 12:13

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, టిడిపి సీనియర్‌ నాయకులు మంతెన వెంకట సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) తండ్రి విశ్రాంత ఉపాధ్యాయులు మంతెన నారాయణరాజు గురువారం రాత్రి మృతి చెందారు. నారాయణరాజు అనారోగ్యంతో గత కొంతకాలం నుంచి హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వగ్రామం పాందువ్వకు తరలిస్తున్నట్లు చెప్పారు. మంతెన నారాయణరాజు మఅతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా మెలిగేవారని ఆయన మరణం మంతెన సత్యనారాయణ రాజు కుటుంబానికి, గ్రామానికి తీరని లోటు అని ఎం ఎస్‌ వర్మ తెలిపారు.