Aug 13,2023 17:12

ప్రజాశక్తి ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ మండలంలోని మూలగిరిపల్లిలో టాటా విండ్‌ పవర్‌ - మండల పరిషత్‌ నిధులు సంయుక్తంగా రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఆదివారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య అధిగమించేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఇటు ప్రభుత్వం అటు ప్రయివేట్‌ సంస్థల సహకారంతో అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటిని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, ఎంపిపి చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్‌ ఎంపిపి నరసింహులు, నాయకులు మూలగిరిపల్లి ఓబన్న, టాటా సంస్థ ప్రతినిధులు సుదర్శన్‌ నాయక్‌, రాకెట్ల అశోక్‌ కుమార్‌, సర్పంచ్‌ శ్రీరాములు, ఉప సర్పంచ్‌ వెంకట రెడ్డి, ఎంపిటిసి ఓబయ్య, బెస్త, కురుబ, ఎంబిసి, కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్లు రమణ, గోవిందు, జోగి వెంకటేష్‌, తేజోనాథ్‌, పంచాయతీ రాజ్‌ జిల్లా అధ్యక్షుడు బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, ఆసిఫ్‌, గ్రామ నాయకులు బసవరాజు, రామాంజనేయులు, రమేష్‌,భాస్కర్‌, ఎర్రిస్వామి రెడ్డి, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.