Apr 18,2023 16:34

ప్రజాశక్తి వీకోట(చిత్తూరు) : మండల పరిధిలోని కారకుంటలో విద్యుత్‌ వైర్లు తగిలి పశుగ్రాసం తరలిస్తున్న లారీలో మంటలు చెలారేగాయి. స్థానికులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం పరిశుగ్రాసం దించేందుకు గ్రామంలోకి వచ్చిన లారీ తిప్పుకునే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే పశుగ్రాసం లారీని కింద పడవేయడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కుప్పం ఫైర్‌ సిబ్బంది కారకుంట గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.