ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఎస్‌ఆర్ పురం వేడుకలు నిర్వహించారు. చిత్తూరు డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, సర్పంచ్ హరితకుప్పయ్య జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, కొత్తపల్లి యుగంధర్ ఆధ్వర్యంలో భారీ కేకుకట్ చేసి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అర్హులైన ప్రతి ఒక కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్ధన్, మనీ హరినాథ్‌రెడ్డి, దామోదర్ నాయుడు, కాలప్ప గుండుమని, దిలీప్ రెడ్డి, వెంకటేశ్ తదిరత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










