Mar 26,2023 08:03

లేపాక్షి పంచాయతీ (అనంతపురం) : ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి దానిలోని సరుకంతా దగ్ధమైన ఘటన శనివారం రాత్రి 11 గంటలకు లేపాక్షి పంచాయతీ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉన్న సార్‌దేనిమ్‌ ఫ్యాక్టరీలో నిన్న రాత్రి 11 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో గోడౌన్‌ వద్ద నిల్వ ఉంచిన వస్త్ర తయారీకి సంబంధించిన సరుకు పూర్తిగా దగ్ధమయ్యింది. రాత్రి నుండి రెండు అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.