Sep 26,2023 12:42

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు అంజుమన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ లో ఒక మొబైల్‌ దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తో దుకాణంలోని సరుకులు మొత్తం కాలిపోయాయి. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రూమ్‌ నుండి పొగరావడం గమనించిన స్థానికులు వెంటనే దుకాణం యజమాని మునీర్‌ అహ్మద్‌ కు సమాచారం అందించడంతో ఫైర్‌ ఇంజన్‌ కు కబురు చేశారు. అగ్నిమాపక దళం వచ్చి మంటలు అదుపు చేసినప్పటికి దుకాణంలోని మొబైల్‌ ఫోన్లు, పరికరాలు, ఫర్నిచర్‌ మొత్తం కాలిపోయాయి. సుమారు పది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణం యజమాని మునీర్‌ అహ్మద్‌ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని దుకాణ యజమాని విజ్ఞప్తి చేశారు.