ప్రజాశక్తి-తణుకు రూరల్ (పశ్చిమగోదావరి) : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణు గోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో శ్రీరామనవమి వేడుకల కోసం చలువ పందిళ్లు వేశారు. ఈ వేడుకల కోసం ఏర్పాటు చేసిన పందిరిలో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చేలరేగాయి. దీంతో ఆలయంలోని భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆలయం వద్దకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.










