Mar 12,2023 15:21

ప్రజాశక్తి - పుత్తూరుటౌన్‌(చిత్తూరు) : పుత్తూరు టాలెంట్‌ స్కేటింగ్‌ అకాడమీలో నాన్‌ స్టాప్‌ 270 కిలోమీటర్స్‌ రోడ్డు స్కేటింగ్‌, మార్తాన్‌ ఓల్డ్‌ రికార్డు విన్నర్‌గా నిలిచిన వేద నరసింహకు రోజా చారిటబుల్‌ ట్రస్టు రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వజ్రా ఓల్డ్‌ రికార్డు ప్రతినిధులు, టాలెంట్‌ స్కేటింగ్‌ కోచ్‌ ప్రతాప్‌, పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్‌ హరి, వైస్‌ చైర్మన్లు డి.జయప్రకాష్‌, డి.శంకర్‌, కౌన్సిలర్లు స్కేటింగ్‌ కోచ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.