లేపాక్షి (అనంతపురం) : లేపాక్షి మండలం కుర్లపల్లి గ్రామంలో చాకలి అంజనప్ప కుమారుడు ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ... లేపాక్షి మండల్ టిడిపి కన్వీనర్ ఈ.జయప్ప ఆదివారం రోజు మృతుని కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం అధ్యక్షుడు గంగిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు రవి, వార్డ్ మెంబర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.










