Apr 28,2023 11:13

గన్నవరం (కృష్ణా జిల్లా) : పోరంకిలో నిర్వహించనున్న ఎన్‌టిఆర్‌ శతజయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు.... ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ సినీ హీరో రజనీకాంత్‌ శుక్రవారం ఉదయం చెన్నై నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రజనీకాంత్‌ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి నందమూరి.బాలకృష్ణ చేరుకున్నారు. రజనీకాంత్‌, బాలకృష్ణ కలిసి విజయవాడకు వెళ్లి పోరంకిలో జరిగే ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.