ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కెనరా బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ... అసలు వడ్డీ కట్టించుకోకుండా ఫైనాన్స్ ప్రకారం ... పంట రుణాలు రెన్యువల్ చేయాలని జిల్లాలో గత సంవత్సరం వర్షాలు ఎక్కువ కురియడంతో వేరుశనగ కంటే ఎదురు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు వేస్తే వర్షాలు అధికంగా కురవడంతో వేరుశనగ పొలాల్లోనే మొలకలు ఎత్తి పిల్లి పోయే పరిస్థితి నెలకొందని, పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా కట్టుకోవాలో తోచని స్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం రైతులందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసలు, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు పెంచి రెన్యువల్ చేయాలని, ఎకరాకు 45 వేల రూపాయలు చొప్పున రెన్యువల్ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ ... ఫైనాన్స్ ప్రకారం రుణాలు పెంచి రెన్యువల్ చేయాలని అన్నారు. మర్డర్ కేసు లేకుండా రూ.10 లక్షలు రుణాలు ఇవ్వాలని, లేకపోతే రెన్యువల్ చేయాలని కోరారు. కేసిసి అకౌంట్ బుక్ ప్రత్యేకంగా అకౌంట్ బుక్కులు ఇచ్చి ఎంత లోన్ ఉందో వివరించాలని అన్నారు. బ్యాంకు వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ ... స్కాల ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు 45 వేలు రూపాయలు చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రాము, అవాజ్ నాయకులు వలి, సిఐటియు మండల కార్యదర్శి జయమ్మ, ఐద్వా నాయకురాలు సరస్వతమ్మ , వెంకటమ్మ, నాయకులు, రైతులు పాల్గొన్నారు.










