ప్రజాశక్తి - పెనుమంట్ర(పశ్చిమగోదావరి) : పొలమూరులో రైతుకు గొను సంచులు కోరతా లేకుండా చూడాలని తడి పొడి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ గ్రామంలో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రహదారి పై రైతులు నిరసన చేశారు. ఈ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలన్ మాట్లాడుతూ.. దాళ్వా పంట చేతికి వచ్చే సమయంలో పకృతి సహకరించంనీ కారణంగా వర్షాలు కారణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గొను సంచులు కోరతా లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. వాతావరణం ఇబ్బందులు ఉన్న సమయంలో ప్రభుత్వం అధికారి యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన సమయం కానీ అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టు గా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు బరకాలు గొను సంచులు కోరతా లేకుండా చూడాలని, తడి , పొడి సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో రైతు గూడాల వెంకటేశ్వరరావు, సుంకర రామంఆంజనేలు , కేతా శ్రీరామమూర్తి , పిల్లి సాయిబాబా , జనసేనా గ్రామం అధ్యక్షులు తోరం వెంకన్నబాబు, గుడేపలి నరసింహ తదితరులు పాల్గొన్నారు.










