ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి వి.టి.రామాంజినేయులు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎస్.సూరి డిమాండ్ చేశారు. అనతరం తహశీల్దార్ సుమతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18న కురిసిన అకాల వర్షాలకు మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలు అరటి, నిమ్మ, మెక్కజోన్న, వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టాపోయినట్లు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి పరిహారం అందించేందుకు వివరాలు సేకరించాలని చెప్పిందని.. కానీ అధికారులు క్రాప్ నమోదు కాలేదని చెప్తున్నారని, ఇప్పటికైనా స్పందించి పంట నష్ట వివరాలు సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు జి.వెంకటచౌధరి, పెద్దయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, వెంకట శేఖర్, పూలరంగడు, నాగసుబ్బరాయుడు, నాగమునేంద్ర తదితరులు పాల్గొన్నారు.










