Aug 13,2022 12:59

వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండల పరిషత్‌ అధ్యక్షురాలు బండి నాగహేమసుంధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎగువ కనికాపురం గ్రామంలో శనివారం స్థానిక సర్పంచ్‌ శ్రీనాథ్‌ రెడ్డి ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మండలంలోని గంటావారిపల్లినూ సర్పంచ్‌ శ్రీనాథ్‌ రెడ్డి హార్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శ్రీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశపు ఉనికిని చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.