ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండల ఎలక్ట్రికల్ ఏఈ వి.ఆనంద్ రాజు (57) గురువారం ఉదయం దువ్వ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు కలరు. ఆనంద్ రాజు మతి పట్ల ఎంపీడీవో జగన్నాధ రావు, తహశీల్దార్ రాజ్యలక్ష్మి, ఎలక్ట్రికల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో పాటు ఏఎంసీ చైర్మన్, చిల్లే లావణ్య, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, జడ్పిటిసి, ఉప్పలపాటి సురేష్ బాబు సర్పంచ్‌లు కోట సరోజిని వెంకటేశ్వరరావు, సుంకర సీతారాం, జక్కం శెట్టి చంటి, గణేశుల శేషవాణి సుబ్బారావు వైసిపి రాష్ట్ర కార్యదర్శి, వైట్ల కిషోర్ కుమార్, తదితరులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి సంతాపం తెలిపారు.










