ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : పరిసరాల పరిశుభ్రతతో దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు రకాల వ్యాధులను దూరం చేయవచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్ష్మణరావు తెలిపారు. వెంకట రామన్నగుడెం, మాధవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రముల పరిధిలోని మోదుగుంటగుంట, పుల్లాయగూడెం గ్రామంలో జరుగుతున్న వెక్టర్ కంట్రోల్ హైజిన్ కార్యక్రమన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. మోదుగుంటలో డాక్టర్ కే.శైలజ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమములో పాల్గొని ప్రజలకు కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యం కోసం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది, సచివాలయం కార్యదర్శులు ఈ కార్యక్రమంలో నిమగమై ఉండాలన్నారు. ముఖ్యంగా వారంలో ఒక్క రోజు డ్రై డే పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉందన్నారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య, పైలేరియా, మెదడువాపు వ్యాధులకు కళ్లెం వేయాలంటే ప్రతి ఒక్కరూ భాద్యతతో గృహాల వద్ద పరిశుభ్ర మైన వాతావరణంకల్పించుట ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు హరనాథ్ బాబు ఈ.కాంతారావు,భాస్కర రావు ఎం.ఎల్. హెచ్.పి.లు, సచివాలయ ఆరోగ్య కార్యదర్శి పాండురంగ, ఎం.ఎల్.హెచ్.పి, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు,డ్వాక్రా మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు.










