Sep 13,2023 15:08

ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు) : మండల కేంద్రమైన వెదురు కుప్పం సచివాలయ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్లను స్థానిక సర్పంచ్‌ శిల్పా, సంతబయలు సర్పంచ్‌ రాజేశ్వరి పెద్ద రెడ్డి , ఎంపీటీసీ రాధికల జడ్పిటిసి చలం పాళ్యం సుకుమార్‌ చేతులమీదుగా బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుత్తూరు మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు మరకల కుప్పం రామయ్య, డిగ్రీ కళాశాల కమిటీ సభ్యులు పేట ఢిల్లీ ప్రసాద్‌ రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ జ్ఞాన కొండారెడ్డి, ఉపసర్పంచ్‌ రాజేశ్వరి , సచివాలయ కన్వీనర్‌ రమేష్‌, గృహ సారథి బాల, డిడిఓ వెంకటేష్‌, కార్యదర్శి టి నరేష్‌, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పెన్షన్‌ లబ్ధిదారులు పాల్గొన్నారు.