Apr 07,2023 13:08

ప్రజాశక్తి -కాళ్ల (పశ్చిమ గోదావరి) : రాష్ట్ర అభివృద్ధి కి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని డిసిసిబి చైర్మన్‌, ఉండి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. శుక్రవారం పెదఅమిరం గ్రామంలో వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహరాజు మాట్లాడుతూ ... వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీను గెలిపించాలని కోరారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తుందన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యను అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంటి వద్దకే వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ప్రజల వద్దకు పాలన అందించేందుకు సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థలను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గడపగడపకు ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్‌ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళ, ఉండి, ఆకివీడు జడ్పిటిసిలు పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, వేగేశ్న వెంకటరాజు, రణస్థుల మహంకాళి ఎంపీపీలు పెన్మత్స విశ్వనాథరాజు, భూపతిరాజుచంటిరాజు, ఇందుకూరి హరిబాబు, కటారి జయలక్ష్మి, ఆకివీడు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జామి హైమావతి, పెదఅమిరం గ్రామ సర్పంచ్‌ డొక్కు సోమేశ్వరరావు, ఉప సర్పంచ్‌ జవ్వాది కిషోర్‌, మండల కన్వీనర్లు గణేశ్న రాంబాబు, పెన్మత్స ఆంజనేయరాజు, సొసైటీల చైర్మన్లు వేగేశ్నజయరామకృష్ణంరాజు, కేశిరెడ్డిమురళి, పేరిచర్ల సూర్యనారాయణరాజు, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.