ప్రజాశక్తి - ఎస్‌ఆర్ పురం( చిత్తూరు) : వైసిపి అభిమాని, క్షీరసముద్రం రేషన్ డీలర్ గుర్రప్ప ఇటీవల మృతిచెందాడు. శనివారం మండలంలోని క్షీర సముద్రం గ్రామ పంచాయతీ క్షీర సముద్రం దళితవాడలో గుర్రప్ప కుటుంబాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. ప్రభుత్వం తరుపున కుంటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ తరపున తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయలు అందజేశారు. ప్రభుత్వం తరుపున 5 లక్షల ఆర్ధిక సాయాన్ని వెంటనే మంజూరు చేయాలని అధికారులు ఆదేశించారు.










