ప్రజాశక్తి - ఎస్‌ఆర్ పురం (చిత్తూరు) : ఎస్‌ఆర్ పురం మండలంలోని జిఎంఆర్ పురం గ్రామ పంచాయతీ దాసరి గుంటలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగనన్న పాటకు తన్మయత్వంతో మహిళలతో కలసి నారాయణస్వామి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










