Mar 14,2023 16:59

ప్రజాశక్తి-వి కోట (చిత్తూరు) : వి.కోటలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలోనికి దారి తప్పి వచ్చిన ఓ జింక మంగళవారం స్థానికుల కంటపడింది. పట్టణ సమీపంలోని చిట్టడవి నుండి జింక దాహంతో తాగునీటి కోసం పట్టణంలోనికి వచ్చినట్లు తెలుస్తోంది. జింకను చూసిన కుక్కలు వెంబడించడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో బాలుర ఉన్నత పాఠశాల మైదానంలోని నీటి తోటిలో పడింది. జింకను చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అదించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గాయపడిన జింకను పశు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. చికిత్స అనంతరం దానిని సమీప అడివిలోకి వదిలినట్లు డి.అర్‌వో వేణుగోపాలరెడ్డి తెలిపారు.