Feb 16,2023 13:22

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, ఎస్‌ఆర్‌ పురం మండలం పిల్లిగుండ్లపల్లిలో దళిత నాయకుడు గురవయ్య (77) అనారోగ్యముతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పిల్లిగుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు నాయకుడు గుణశేఖర్‌ నాయుడు ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.