ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడం బాధాకరం : డిపి రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు
ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ఆపదలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేయడం మానవ ధర్మమని, సేవా చేయడం భగవత్ సేవతో సమానమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం 4వ వార్డు నరసయ్య అగ్రహరంకు చెందిన ఆత్రగడ్డ పెద్దింట్లు కుటుంబంలో 20 నెలల కాలంలోనే తండ్రి, తల్లి, అన్నను కోల్పోయిందని, ఆ బాధిత కుటుంబానికి బుధవారం రాష్ట్ర కృష్ణ బలిజ సాధికారిక సంఘం సభ్యులు గంటా త్రిమూర్తులు రూ.11 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఇలాంటి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు, స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని కోరారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం కూడా భరోసా కల్పించాలని అన్నారు. ఆ కుటుంబానికి టిడిపి తరుఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.11 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, వైస్ ప్రెసిడెంట్ లంకి శ్రీనివాస్, మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, మైలబత్తుల ఐజాక్ బాబు, విన్నకోట వినాయక్, తిప్పా ముత్యం, చెల్లబోయిన గోవింద్, యలమంచిలి శ్రీనివాస్ రావు, కాపా అమర్ బాబు, గణపతి తదితరులు పాల్గొన్నారు.










