ప్రజాశక్తి -పెనుకొండ :యుటిఎఫ్ పెనుకొండ జోన్ అధ్వర్యంలో స్వర్గీయ రామాంజనేయులు జ్ఞాపకార్థం వారిపేరు మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ఎస్ ఐ రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ పోరాటాలే కాకుండా ఈ విధంగా ఉపాధ్యాయుల మధ్య ఇలాంటి క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా మంచి వాతావరణం అన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యు టి ఎఫ్ నాయకులు నారాయణ స్వామి, నరేష్ ,గంగాధర్ ను అభినందించారు. టీచర్స్ పోటీలతో పాటుగా విద్యార్థులకు మంచి భోధన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటి ఎఫ్ నాయకులు రవీంద్ర,శివ,శేషాద్రి,నాగార్జున రెడ్డి,ఉపేంద్ర,ఆది జినేష్, శ్రీనివాస్ రామాంజి,తదితరులు పాల్గొన్నారు.










