తుంగభద్ర పై నిర్మిస్తున్న ఆప్పర్ భద్ర డ్యామ్ నిర్మాణం ఆపాలి : సిపిఐ నేత నాగార్జున
రాయదుర్గం (అనంతపురం) : కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన నిర్మించ తలపెట్టిన అప్రభద్ర ప్రాజెక్టును నిర్మాణాన్ని వెంటనే ఆపాలని సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి ఎం.నాగార్జున డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ నుండి ఆధునీకరణ పనుల లోపం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు అందే పరిస్థితిలో లేదన్నారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువకు 32.80 టీఎంసీల నీరు కేటాయింపులు ఉన్నాయి. దీనికి అదనంగా కె సి కెనాల్ డైవర్షన్ ద్వారా మరో 10 టిఎంసి నీరు జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ విధంగా జరగడం లేదని ఎం.నాగార్జున తెలిపారు. తుంగభద్ర డ్యాంలో పూడిక కారణంగా డ్యామ్ నిలువ సామర్థ్యం 130 టీఎంసీల నుండి 100 టీఎంసీలకు పడిపోయిందన్నారు. అందువల్ల తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు దామషా పద్ధతిలో కేటాయింపులు తగ్గిపోయాయన్నారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. దీనివల్ల సాగు విస్తీర్ణం కూడా తగ్గుతుందని చెప్పారు. తుంగభద్ర ఎగువ కాలువమొత్తం 1,00,060 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఈసారి 85,398 ఎకరాలు మాత్రం సాగయిందని, ఇందులో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అంటే కనేకల్. బమ్మనహల్ మండలాల పరిధిలో 15,660 ఎకరాలు మాత్రమే సాగయిందని చెప్పారు. మొత్తంగా తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణల పనులు చేపట్టకపోవడం వల్ల వర్షాల వల్ల నీరు పెరిగినప్పటికీ సాగు విస్తీర్ణం తగ్గిపోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆధునీకరణ పనులు చేపట్టాలని, ఇలాంటి పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాం పై అప్పర్ బద్ర డ్యామ్ నిర్మాణం చేపడితే జిల్లాకు సాగు తాగు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాలు కర్నూల్, కడప, చిత్తూర్ తోపాటు ప్రధానంగా అనంతపురం జిల్లా ప్రజలకు అప్పర భద్ర డ్యామ్ నిర్మాణం గాని చేపట్టి పూర్తయితే ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా తాగునీరు, సాగునీరు లేక గ్రామాలు వదిలి కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వలస వెళ్లవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ విషయం పై ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అప్పర్ బద్ర ప్రాజెక్టు నిలుపుదలకు భాగస్వామ్యం కావాలన్నారు వెంటనే బద్ర డ్యామ్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సి పి ఐ పట్టణ కార్యదర్శి కోట్రెష్, ఇంచార్జ్ నర్సింహులు, గుమ్మగట్ట మండల కార్యదర్శి తీప్పేస్వామి నాయకులు నీరంజనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










