ప్రజాశక్తి-అనంతపురం క్రైం : గొర్రెల సరఫరా విషయంలో తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. స్థానిక వివరాల మేరకు... తెలంగాణాకు గొర్రెలను సరఫరా చేసే విషయంలో ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శనివారం అనంతపురంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రాజహంస గెస్ట్ హౌస్ వద్ద ఘర్షణకు దిగారు. గొడవ పెద్దది కావడంతో వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను స్టేషన్ కు తరలించారు. విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ రెడ్డప్ప తెలిపారు.










