Aug 25,2023 15:19

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ :నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అధికారులను ఆదేశించారు.నగరంలోని 39,41 డివిజన్ల పరిధిలో రూ.20, 30 లక్షల వ్యయంతో జీజీఎంపీ నిధులతో చేపడుతున్న సిమెంట్‌ రోడ్‌, డ్రైనేజీ పనులను శుక్రవారం నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం పరిశీలించారు.ఈ సందర్భంగా నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం మాట్లాడుతూ త్వరితగతిన, నాణ్యతతో పనులు పూర్తి చేసేలా అధికారులు చూడాలని సూచించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహకారంతో నగరానికి రూ.25 కోట్ల స్పెషల్‌ గ్రాంట్‌ విడుదల అయ్యిందనన్నారు.రూ.25 కోట్ల స్పెషల్‌ నిధులతో నగరంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు,కల్వర్టుల అభివఅద్ది పనులు చేపడుతున్నట్లు మేయర్‌ వసీం పేర్కొన్నారు.కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుబ్బ రంగయ్య కార్పొరేటర్‌ కమల్‌ భూషణ్‌, పాల్గొన్నారు.