ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక ఏడిద రోడ్డులోని దుర్గమ్మ ఆలయం పక్క వీధిలో శబ్దకాలుష్యం పై అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. మండపేట పురపాలక సంఘంలో సోమవారం నిర్వహించిన స్పందన లో మేనేజర్ తాతపూడి కనకరాజుకు ఫిర్యాదు అందజేశారు. ఆ వీధిలో కొత్తగా వర్క్ షాప్ ఏర్పాటు చేశారని అక్కడ రాత్రి పగలు పెద్ద శబ్దాలతో పనులు చేస్తున్నారని వి.రామకఅష్ణ, శ్రీను, చౌదరిలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో నిద్రపోవడానికి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో వారి చదువులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు.










