ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలోని పంపనూరు గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అనంతరం కూలీలతో మాట్లాడుతూ ... పని దినాలను పెంచడం జరిగిందని, కూలీలకు బిల్లలు త్వరగా పడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కూలీల శాతం పెంచాలని ఏపీఓకు ఆదేశాలు జారీ చేశారు. ఏ పీ ఓ మాట్లాడుతూ ... రైతులు వేరుశనగ పంట తొలగించే పనుల్లో ఉన్నారని అవి పూర్తి అయిన తర్వాత కూలీ శాతం పెంచుతామని తెలియజేశారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. కొంతమంది సిబ్బంది లాంగ్ లీవ్ పెట్టి వెళ్లడం జరిగిందని అలాగే సర్పంచ్ ఎర్రిస్వామి కొంతమంది లాంగ్ లీవ్ పెట్టి వేరే జాబ్ ప్రిపేర్ అవుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్ వీటిని పరిశీలిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈఓఆర్‌డి సత్తిబాబు, ఏపీవో సుజాత, పంపనూరు సర్పంచ్ యడుమల ఎర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.










