Jul 08,2023 12:30

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యతని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. గణపవరం ప్రాథమిక ఆసుపత్రి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ మహౌత్సవ సందర్భంగా అర్థవరంలో జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇంటి యజమానిదని.. ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య నిర్మూలలపై దృష్టి పెట్టాలని కోరారు. డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ.. డెంగ్యూ నివారణ మహోత్సవాలు నెలరోజుల పాటు గ్రామాల నిర్వహించి ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకటరామరాజు, సిహెచ్‌ఓ జాలాది విల్సన్‌ బాబు, హెల్త్‌ అసిస్టెంట్లు జి.శ్రీనివాస్‌, ఏ.కష్ణ, ఎం.యేహన్‌, ఎం.నల్లయ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.