ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి కరెంటు షాక్ తగిలి మృతి చెందిన ఘటన ఆదివారం గుత్తి మండలంలోని కె.ఉబిచెర్లలో జరిగింది. గ్రామానికి చెందిన రామచంద్ర, హరిత దంపతులకు ముగ్గురు సంతానం. 3వ సంతానమైన భరత్ (2) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా విద్యుత్ స్తంభానికి సంబంధించిన కరెంటు వైరు తగిలి మరణించాడు. చిన్నారి మఅతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.










