ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలం హైస్కూలు వద్ద చలో ఢిల్లీ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కార్మికులు కర్షకుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ... ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు అద్యక్ష కార్యదర్శులు జయమ్మ, రమాదేవి, మండల నాయకులు శివశంకర్, మధ్యాహ్న భోజనం కార్మికులు మీనాక్షి, సుబ్బమ్మ, మారెక్క, తదితరులు పాల్గొన్నారు.










