ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం(అనంతపురం) : జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దేవరకొండ మీద దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడిండింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.










