ప్రజాశక్తి-ముదిగుబ్బ (అనంతపురం) : కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ .... ముదిగుబ్బ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఆటో పెద్దన్న మాట్లాడుతూ ... కరెంటు బిల్లులు తగ్గించాలని, రైతుల మోటర్లకు మీటర్లు అమర్చకూడదని అన్నారు. పేదలపై పెనుభారం మోపుతున్న ప్రభుత్వం కరెంటు బిల్లులు సామాన్యులకే షాక్ కొట్టే విధంగా ఇస్తుందని అన్నారు. కరెంటు బిల్లులు తగ్గించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేస్తామని సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు శివకుమార్, రైతు సంఘం నాయకులు బండల వెంకటేష్, లక్ష్మీనారాయణ, ఓబులేష్, నాగప్ప, ఓబులమ్మ, మంగమ్మ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.










