ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పండిత విల్లూరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ కడలి సూర్యారావు (80) సోమవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మతి చెందారు. ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా.గోపాలన్, మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు,సిర్రా నర్సింహమూర్తి, యస్.వి.యన్‌శర్మ, సీనియర్ నాయకులు తలుపూరి బుల్లబ్బాయి సూర్యారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేతా గోపాలన్ మాట్లాడుతూ.. నమ్మిన సిద్దాంతం కోసం జీవిత చరమాంకం వరకూ నికరంగా నిలబడి పోరాటం చేసిన నిస్వార్ధ ప్రజానాయకుడు కడలి సూర్యారావు అని కొనియాడారు.










