May 27,2023 13:22

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ మాట్లాడుతూ ... ఉపాధి హామీ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కూలీలంతా ఐక్యతతో బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉపాధి కూలీల సమస్యలపై నిరంతరం పోరాడుతామన్నారు. ఒకవైపు ఎండ మరోవైపు ఉక్కపోత ఉన్నప్పటికీ ప్రభుత్వం పని ప్రదేశాల్లో తాగునీరు మజ్జిగ కల్పించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెండు పూటలా పని విధానాన్ని, ఫోటో సిస్టంను తక్షణమే రద్దుచేసి పని ప్రదేశంలో కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సిర్రా నరసింహమూర్తి, వద్దిపర్తి అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.