ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కాలనీకి ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం తహశీల్దార్ కార్యలయం వద్ద సిపిఐ నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుండి నివాసముంటున్న ఇంటి పట్టాలు మంజూరు చేయలేదన్నారు. అధికారులు మారిపోతున్నారే కానీ కాలనీలో నివాసముండే నిరుపేదలకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. వెంటనే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గ కార్యదర్శి కత్తి నారాయణస్వామి రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి రాము, నార్పల మండల కార్యదర్శి గంగాధర, సహాయ కార్యదర్శి రమేష్, రైతు సంఘం మండల కార్యదర్శి జోసప్ప లలితమ్మ, కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










