May 22,2023 11:54

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ప్రజలకు సిఎం జగన్‌ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ... పాలకొల్లులో జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ సారధ్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసిపి కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణ సిఐ డి.రాంబాబు, ఎస్‌ఐలు బాదం శ్రీనివాస్‌, ముత్యాల రావులు నిరసనను అడ్డుకొని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో వైసిపి నేతలు పోలీసులను అడ్డగించారు. ఈ సందర్భంగా కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ... సెంటు భూమి దేనికి పనిచేయబోదని చెబుతున్న చంద్రబాబు తన హయాంలో టిడ్కో గృహాలు సెంటు కన్నా తక్కువ స్థలంలో ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యడ్ల తాతాజీ, జెడ్పిటిసి నడపన గోవిందరాజులు, జోగి వెంకటేశ్వరావు, గాదె వెంకన్న, పవన్‌, మైఖేల్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.