ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : ప్రతి గడపకు వెళ్లి అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరువ చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ... మంగళవారం నగరంలోని 12 వ డివిజన్ పరిధిలో 17, 19 సచివాలయాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి, విజయ భాస్కర్ రెడ్డి లతో కలసి పాల్గన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇంకా ఎవరికన్నా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకుంటే జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫక్రుద్దీన్, అనిల్ కుమార్ రెడ్డి, కమల్ భూషణ్, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఆర్ ఐ మురళి, తదితరులు పాల్గొన్నారు.










