Nov 15,2022 15:02

ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌ (చిత్తూరు) : 55వ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా పుత్తూరులో గ్రంథాలయంలో మంగళవారం పుస్తక ప్రదర్శన నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి మీనా కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నైనారు మధుబాల ఆదేశాల మేరకు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం నిర్వహించమన్నారు. గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సంబందించిన పుస్తకాలు, బాల సాహిత్యం, మ్యాథ్స్‌, సైన్స్‌, విజ్ఞాన సంబందించిన పుస్తకాలు, భారతం, భగవత్‌ రామాయణం వతి పుస్తకాలను ప్రదర్శించారు. ఈ పుస్తక ప్రదర్శనలో కాపు వీధి ఎం పి యూ పి పాఠశాల ఉపాధ్యాయులు విజయ నాగు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగులు, పాఠకులు శంకరయ్య, సుధాకర్‌ రాజు, శంకర్‌ రాజు, గంగాధర్‌ రెడ్డి, లక్ష్మీపతి, శేఖర్‌ రాజు, చాంద్‌ బాషా, చిరంజీవి, గ్రంథాలయ సిబ్బంది సుజాత పాల్గొన్నారు.