తనకల్లు (అనంతపురం) : రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఎంపిటిసి ఈశ్వరప్ప మృతి చెందిన ఘటన మంగళవారం తనకల్లు మండలంలో జరిగింది. తనకల్లు మండలం ఈతోడు ఎంపీటీసీ ఈశ్వరప్ప, అతని స్నేహితుడు ఓబులేసులు ఈరోజు ఉదయం 9 గంటల 15 నిముషాలకు బైక్‌పై వెళుతుండగా, కొక్కంటి క్రాస్ ఆర్ డి టి హాస్పిటల్ వద్ద బైకు అదుపుతప్పి ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీటీసీ ఈశ్వరప్ప అక్కడికక్కడే మృతి చెందారు. స్నేహితుడు ఓబులేసును మెరుగైన చికిత్స కోసం కదిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










