Jul 15,2023 13:26

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌. మధుసూదన్‌ రావు తెలిపారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ప్రభుత్వ వసతులు విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 52 వసతి గృహాలు ఉండగా 4500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని చెప్పారు. డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలను ప్రభుత్వం పెంచిందన్నారు. బడ్జెట్‌ కూడా కేటాయించిందని, త్వరలో డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి రాధిక, వార్డెన్‌ భాష, సిబ్బంది రాధాకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.