Aug 17,2023 13:19

ప్రజాశక్తి-అనంతపురం : జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. దురద కుంట గ్రామంలోని కూండ్ల రమేష్‌ వ్యవసాయ పొలంలోని మొక్కజొన్న తోటలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఇవాళ ఉదయం పొలంలోకి వెళ్లిన కూలీలకు ఎలుగుబంటి కంటబడింది. ఎలుగుబంటిని చూసిన మహిళలు భయాందోళనలతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సమీప పోలంలోని రైతులు చాకచక్యంతో ఎలుగుబంటిని సమీప కొండల్లోకి తరిమారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు.