ప్రజాశక్తి-ఎస్‌ఆర్ పురం (చిత్తూరు) : గుర్తుతెలియని వాహనం ఢీకొని అయ్యప్ప మాల ధరించిన భక్తుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ... మండలంలోని శెట్టివానాత్తం గ్రామ పంచాయతీకి చెందిన ఎగువ శెట్టి వానాత్తం గ్రామవాసి చంగళ్ రాయలు రెడ్డి (55) గత వారం క్రితం అయ్యప్పమాల ధరించి రాత్రి గంగమ్మ గుడి దగ్గర వద్ద అయ్యప్ప స్వామి పూజ చేసి గంగమ్మ గుడి వద్దనే నిద్రించాడు. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో చిత్తూరు పుత్తూరు రోడ్డుపై నడిచి వెళుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢకొీట్టడంతో చంగళ్ రాయలు రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని ఎడమ కాలు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడిపోయిఉన్నది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి . అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










