ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని దేవదొడ్డి గ్రామంలో మండల వ్యవసాయాధికారి మునికృష్ణ ఆధ్వర్యంలో కార్తికేయన్ అనే రైతు పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ముప్పై ఆరడుగుల పొడవు ముప్పై ఆరడుగుల వెడల్పులో కూరగాయల నమూనాను సాగు చేశారు. ఈ సందర్భంగా మునికృష్ణ మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయ పద్దతిలో పై నమూనలో చిన్న చిన్న క్షేత్రలు ఏర్పాటు చేసుకుని 15 రకాల పంటలు పండించుకోవచ్చన్నారు. ఇందులో తిగజాతి, దుంపజాతి, ఆకుకూరలు, టమోటో, బెండ, వంగ, పండ్ల మొక్కలను పెంచి తక్కువ నీటితో అధిక ఆదాయన్నీ పొందవచ్చని తెలిపారు. ఇలా పండించుకోవడం ద్వారా విషరహిత కూరగాయలు తినవచ్చని, తద్వారా అనారోగ్యల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్పీ రవిసాగర్, ఎంపీఈఓ పవన్, సిబ్బంది మాక్బుల్ జాన్,సి.విజకుమారి,రాహుల్,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.










