Sep 06,2022 14:51

ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి (చిత్తూరు) : బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజరు చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఆశ వర్కర్లకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ విజయచంద్ర మాట్లాడుతూ.. పోషకాహార ప్రాముఖ్యత గురించి వివరించారు. పిల్లలు, యుక్త వయసు వారు, గర్భవతులు, బాలింతలు, వృద్దులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలను వివరించారు. ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్‌ పండ్లు తీనండం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిపారు. అంటువ్యాధులు, జ్వరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఎప్పుడెప్పుడు వేయించాలి వాటి వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా ఆశ వర్కర్లకు, సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్వో . ఏఎన్‌ఎంలు. ఆశ వర్కర్లు పాల్గొన్నారు.