Oct 18,2022 13:22

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, బలిజ మొండివెంగనపల్లెకు చెందిన పోటుగారి భాస్కర్‌ పీసీసీ మెంబర్‌ గా నియమితులయ్యారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడుగా, యువజన కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడుగా భాస్కర్‌ పని చేశారు. పీసీసీ మెంబరుగా నియామకం కావడంతో పార్టీలో బాధ్యత మరింత పెరిగిందని, పార్టీ బలోపేతంకు నిరంతర కృషి చేస్తానని పోటుగారి భాస్కర్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయనకు మండల, నియోజకవర్గ కేడర్‌ అభినందనలు తెలిపారు.